రైతే రాజు



img


రైతే రాజు,ఈ మాట వినడానికి, పుస్తకాలలో రాయడానికి,పెద్దల సభల్లో చెప్పడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ మాట నిజం చేయడం చాలా కష్టం,నిజం చెప్పాలంటే అసాధ్యం. రైతు దేశానికి వెన్నుముక అని మనం చిన్నపుడు పుస్తకాలలో చదువుకున్నాం కానీ ఈ రోజు దేశానికే వెన్నెముక వంటి రైతు వెన్నుముకె విరిగే దశలో ఉంది. రైతులను కాపాడుకోవాల్సిన భాద్యత పౌరులందరిపై ఉంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పండించే రైతూ ఉండడు, జీవించే మనమూ బ్రతకాలేము.

మనం వెలుగును చూడాలంటే సూర్యుడు మండుతూనే ఉండాలి, మన కడుపులు నిండాలంటే రైతు వ్యవసాయం చేస్తూనే ఉండాలి.వెలుగు లేకున్నా కొన్ని నెలలు బ్రతకోచ్చు కానీ తిండి లేకుంటే కొన్ని వారాలు కూడా బ్రతకాలేము.వ్యవసాయం అనేది ఒక పవిత్రమైన వృత్తి ప్రధాన మంత్రి పదవి కంటే ఎంతో ఎక్కువ భాద్యతయుతమైనది.రైతు అంత ముఖ్యమైన వాడు కాబట్టే మన ప్రధాని L B  శాస్త్రి గారు "జై జవాన్ జై కిసాన్" అన్నారు.అక్కడ సరిహద్దులలో సైనికులు గస్తీ చేయకుంటే ఇక్కడ రైతు నాగలి పట్టకుంటే సునమిలో కిట్టుకుపోయే నీటి చుక్క వంటివి.రైతుకు కావాల్సింది జాలిపడే గుండె కాదు ఆపదలో ఆదుకునే చేతులు కావాలి.

రైతు,వ్యవసాయం గురించి ఒక చిన్న కథ చెబుతా వినండి ౼ అది సృష్టి ఆవిర్భావం ప్రారంభ దశ బ్రహ్మ దేవుడు మనుషుఉలను సృష్టించి వాళ్లకు ప్రేమ అనురాగాలు తెలిపి ఈ భూమి మీద మీ సంతానాన్ని వృద్ధి చేస్తూ ఆనందంగా జీవించండి,సృష్టి మనుగడ ఆడవాళ్ళు అమ్మ తత్వం వల్ల ముందుకు కొనసాగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.రోజులు గడిచేకొద్దీ ఆడవాళ్లు గర్భన్నీ దాల్చుతూ సంతానాన్ని పెంచుతున్నారు.అప్పుడు ఆ కాలంలో ఉన్న కొంత మంది మునులకు ఒక సందేహం కలుగుతోంది "ఆడవాళ్లకు సృష్టిని నిర్మించే శక్తిని ఇచ్చాడు బ్రహ్మ",ఈ అమ్మ తత్వం దైవ తత్వంతో సమానంగా ఉంది.మగ వాళ్లకు కూడా అమ్మ తత్వంలా గౌరవింపబడే ఒక వృత్తిని సృష్టించాలని బ్రహ్మ దేవుణ్ణి వేడుకగా మునుల కోరిక ఆలపించిన బ్రహ్మ దేవుడు వ్యవసాయం అనే వృత్తిని సృష్టించి మగవాళ్ళంతా వ్యవసాయం చేయండి ,వ్యవసాయం చేసే మగవాళ్లు కన్నా తల్లులతో సమానంగా గౌరవింపబడతారు "కన్న తల్లి ఒక బిడ్డ ఆకలి తీర్చితే రైతు ఎందరో కన్న తల్లుల ఆకలి తీర్చుతాడు" అని చెప్పి మాయమౌతాడు. కానీ మన దేశంలో కన్న తల్లులకు,వ్యవసాయం చేసే రైతన్నకు ఇద్దరికీ గౌరవం లేకుండా పోయింది.

ఎండనక వాననకా రైతు కష్ట పడి పంట పండిస్తేనే మనం సంతోషంగా తింటున్నాం,రేయనక పగలనక జవాన్ గస్తీ కాస్తేనే మనం సుఖంగా నిద్రపోతున్నాం.జవాన్ కు జీతం, చనిపోతే కుటుంబ సభ్యులకు భరోసా స్మారక స్థూపాలు,రైతు చనిపోయినా కూడా దరిదాపుల్లోకి ఎవరూ రారు.దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యం. ప్రతి పౌరుడు జవాన్లకు ఇచ్చే గౌరవం రైతులకు కూడా ఇవ్వాలి.

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు,కానీ వీరిద్దరి విజయం వెనకాల ఒక రైతు ఉంటాడు. ఈ రోజున లక్షల కోట్లు సంపాదించి ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న మస్క్ మరియు అలాంటి వారెందరో విజయాల వెనక ఒక రైతు ఉంటాడు.రైతు ఉండడమేంటి అనుకుంటున్నారా!- ఒక మనిషి కడుపు నిండా భోజనం చేసిన తర్వాతే సంపాదన గురించి ఆలోచిస్తాడు అతనికి తిండి దొరకనపుడు ఆహారాన్ని సంపాదించే పనిలోనే ఉంటాడు కానీ డబ్బు సంపాదించే పనిలో ఉండడు.డబ్బుతో ఆకలి తీర్చుకోగలం కానీ ఎన్నాళ్ళు, రైతు పంట పండించినంత కాలం. ఒక సంవస్తరం పాటు రైతులందరు వారి కుటుంబాలకు సరిపడా పంటల మాత్రమే పండిస్తే ప్రపంచ కుబేరుల పంట పొలాల వైపు రైతుల వైపు చూడాల్సి వస్తుంది అప్పుడు అర్థమవుతుంది రైతు విలువ.అప్పుడు ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకుంటారు రైతే రాజు అని,గౌరవిస్తారు అభిమాణిస్తారు.

Post a Comment

0 Comments