విద్య నిగూడ నిది

చదువు౼జీవితం


చదువు చదువు అంటే తెలిియని వ్యక్తిి,చదువు గురించి ఎరుగని మనిషి ,చదువు విలువ తెలియని ప్రజలు 
ఈ రోజులలో ఒక్కరుకుడా ఉండరు. 
     
img

మానవుడు భూమి మీద జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే గత ఇరవై ఏళ్లుగా మనిషి జీవన విధానం అనుకోని విదంగా మారిపోయింది.ఈ మానవ జీవన విధాన మార్పుకు ముఖ్య కారణం టెక్నాలజీని అని చాలా మంది అనుభవగ్నుల వాదన.మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటినుండే టెక్నాలజి అభివృద్ధి చెందటం ప్రారంభం అయింది.మనిషి తన ఆలోచనలకు పదును పెట్టి ఒక లిపి కనిపెట్టి చదవటం ప్రారంభించాడు,మెల్లిగా ఈ చదవటం అభివృద్ధి చెందింది.
     
img

పూర్వ కాలంలో చదువు జీవితానికి అన్వయించుకునేల చదివేవారు,కానీ ఇప్పుడు మాత్రం చదివే చదువుకు,బతికే బతుకుకు అస్సలు సంబంధం లేకుండా పోయింది.
   
img

నిజానికి ఈ చదువులు టెక్నాలోజీలు లేనప్పుడే మనిషి చాలా సంతోషంగా, ఆరోగ్యంగా బతికాడు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మనిషికి బతకడానికి చదువు కావాలి కానీ చదువుకుంటేనే బతుకు అనుకోకూడదు.కానీ ఇప్పటి జెనెరేషన్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని,పిల్లలకి ఇష్టమైన చదువు చదువుకొనికుండా వాళ్ళకి ఇష్టమైన చదువు చదవమని బలవంత పెడుతున్నారు.
 
img
వాల్మీకిని వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకొని సుకంగా బతుకు అనుంటే రామాయణం రచించేవాఫు కాదు,అమితాబ్ బచ్చన్ బిగ్ బి అయ్యేవాడు కాదు.నవ సమాజ భవిత వారికి ఇష్టమైన చదువు చదివితే చరిత్ర సృష్టిస్తారు,ఇష్టం లేనిది చదివితే చరిత్రలో కలిసి పోతారు.
 
img

పూర్వం రామయ్య మరియు సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు రామయ్యకి చదువంటే చాలా ఇష్టం ,సోమయ్యకి వ్యవసాయం అంటే ఇష్టం.రామయ్య తండ్రికి చాలా వ్యాపారాలు ఉండేవి.రామయ్యకి తండ్రి ఎప్పుడు ఇలా చెప్తుండేవాడు " అరే రామయ్య నీకు చాడువెందుకురా మనకు కావాల్సినంత డబ్బు  అనేక వ్యాపారాలు ఉన్నాయి.నువ్వు వాటిని చూసుకో చాలు ఐనా ఎంత సీజడివినా చివరి ఎవరో ఒకరి దగ్గర ఉద్యోగం చేయవలసినదేగా అదే పని ఇప్పటినుంచే మన వ్యాపారం లో చేసుకో" నాన్నగారు అంతలా చెపుతున్నపుడు వినకపోతే బావుండదని భావించి వ్యాపారాన్ని చూసుకో సాగాడు.డబ్బు సంపాదిస్తున్నాడు కానీ తన సంతోషాన్ని, సంతృప్తిని కోల్పోయాడు.సోమయ్యకి వ్యవసాయం అంటే పిచ్చి అయినప్పటికీ బలవంతంగా చదువుకొని,తప్పదన్నట్లు ఉద్యోగం చేస్తున్నాడు.ఇక్కడ ఇద్దరి జీవితాల్లోనూ ఆనందం లేదు కానీ ఎవరికి నచ్చిన దారిన వారు వెలితే ఆనందంగా ఉండేబారు కాస్త ప్రోస్థాహం ఇస్తే అద్భుతాలు సృష్రించేవారు కూడా. 

Post a Comment

0 Comments