mechanic- 3

 హలో అంకుల్ నమస్తే, ఎలా వున్నారు. 

బాగున్నాం బాబు, అమ్మ నాన్న రాలేదా?

రాలేదు అంకుల్, ఈ పక్కనే నాకు కొంచం పనుంటే అది చూసుకొని పలకరించి వెలదామని ఇలా వచ్చా.. 

సుజాత ఇంట్లో లేదా?

వుంది బాబు, పిలుస్తుండు. నువ్వు కూర్చో. 



సుజాత.. సుజాత ఏం చేస్తున్నావే లోపల ఇలారా ఒకసారి, హా.. వస్తునానమ్మ.... అనుకుంటు ఆదర బాదరాగా వస్తుంది. తన రూములోనుంచి బయటికి వచ్చి మహేష్ని చూడగానే ప్రపంచంలోని సిగ్గుమొత్తం తన మొహంలోకి వచ్చింది. మహేష్ని చూశాక తలదించుకొని వచ్చి ఏంటమ్మా పిలిచావు అని అడిగింది. 

అల్లుడుగారువచ్చారు నువ్వెళ్ళి కాఫీ తీసుకరాపో.. 

సిగ్గుతో తలదించుకొని హయ.. సరే అమ్మ అని కిచెన్లోకివెళ్ళింది కాఫీ తయారు చేసి సాసులో కప్పు పెట్టుకొని బయటికి వచ్చింది. 

ఎంటే అలా చూస్తూ నిలబడ్డావు వెళ్ళి అబ్బాయికి కాఫీ ఇవ్వు. మొహం నిండా సిగ్గు వున్న దాన్ని బయటికి కనబడకుండా తలదించుకొని మెల్లగా మహేష్ దగ్గరికి వెళ్ళింది. 

మహేష్ ముందుకెళ్ళి అతనికి కాఫీ ఇస్తుంటే తను ఒక్కసారిగా తనమొహం చూసేసరికి బాడీ మొత్తం షేక్ అయ్యింది. 

ఒక్కసారిగా కళ్ళు చేతులు వనికాయి, దాంతో కాఫీ కప్పు చేతులోంచి జారిపోయింది. జారిపోయి మహేష్ పాయింట్ మీద పడింది. అతను ఆ వెడికి ఒక్కసారిగా అబ్బా అన్నాడు. సుజాత ఒక్కసారిగా వులిక్కిపడింది. 

బయంతో సారీ కూడ చెప్పకుండా సిగ్గుతో దూరంగా వెళ్ళిపోయింది. ఎంటే కాఫీ అలా చేజార్చావు. సరిగ్గా ఇవ్వచ్చుగా. 

కలిందా బాబు ఏమనుకోకు బై మిస్టేక్ లో తన చేయి జారీ వుంటుంది. కాఫీ చూసుకొని ఇవ్వచ్చుగా. కొంచమైన బుద్దివుండాలి. 

ఏం కాలేదు ఆంటీ తననేం అనకండి. నాకు పెద్దగా ఏం కాలేదు, నేను వెల్లస్థాను  మరి .. 

బోజనం చేసి వెళ్తువు ఆగు బాబు, ఎలాగూ లంచ్ సమయం అయిందిగా. 

పర్లేదు ఆంటీ మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను. నేను మా ఫ్రెండ్ ఇంటికి వస్తానని చెప్పాను లంచ్ కి వెళ్తాను.. 

బై ఆంటీ బై అంకుల్. 

ఒసే  వెల్లవే అబ్బాయిని సాగనంపు, కారు దాకా వెళ్ళు నేను వెళ్ళాను. 

వెళ్ళవే అని బయటికి నెట్టేసింది సుజాతని.. 

అలా మహేష్ వెనుకాల కారుదాక వెళ్ళింది. 

మహేష్ కారు ఎక్కి బై సుజాత అని చెప్పాడు. 

సుజాత తలదించుకొని బై అంది. 

కార్ స్టార్ట్ చేసి మహేష్ వెళ్ళిపోయాడు. 

ఆ రోజంతా తన రూములోనుంచి బయటికికూడ రాలేదు రాత్రి కూడా వాళ్ళమ్మ ఎంత పిలిచిన బయటికి రాకుండా అలాగే పడుకుంది. 

మరునాడు ఉదయం ౯ గం|| అవుతుంది. బండి తీసుకొని బయటికొచ్చీ ఆఫీసుకెళ్లాడానికి రెడీ అయ్యి రమ్యకు ఫోన్ చేసింది. హలో రమ్య ఎక్కడున్నావే? 

ఇంటి దగ్గరే వున్నా. 

వెయిట్ చేయి నేను వస్తున్నా. ఇద్దరం కలిసి ఆఫీసుకెలదం. ఒకే తొందరగా రా.. 

ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఆఫీసుకెళ్లారు. బండి పార్కింగ్ లో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు. 

సుజాత- ఒసే రమ్య నిన్నెమయిందో తెలుసా?

రమ్య- తెలుసు నా చెవి రింగు విరిగిపోయింది.  

అది కాదే నిన్న మహేష్, అదే నా వుడ్భి మద్యానం మా ఇంటికి వచ్చాడు. మా అమ్మ కాఫీ ఇమ్మంది. కాఫీ ఇస్తుంటే అది జరిపోయి అతనిమీద పడింది ఒక్కసారిగా అబ్బో అని అరిచాడు. దాంతో నాకు చాలా బయమేసింది. ని సిగ్గు పాడుగాను. నీకు కొత్త వాళ్ళను చూసిన సిగ్గే, పాత వాళ్ళతో మాట్లాడిన సిగ్గే. ఇలా అయితే కస్టమే. 

అలా ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతుండగా సుజాతకి ఫోన్ వచ్చింది, బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసి హలో అంటుంది. 

అటువైపు నుంచి ఒక యునోనిమస్ పర్సన్. 

ఎంటి బేబీ ఈ మధ్య తెగ ముస్తాబవుతున్నావ్, ఎలా వున్నావ్ సుజాత బయం తో వనుకుతుంది. 

ఎవరో, ఎవరో, ఎవరో, చెప్పు -రమ్య 

ఎంటే నన్ను కాదని ఇంకోకనితో పెళ్ళికి రెడీ అయిపోయవంట నేను నచ్చలేదా? నువ్వెవరినైనా చూడు చివరికి నేనే నున్ను పెళ్లి చేసుకుంటా. 

రమ్య సుజాత దగ్గరనుండి ఫోన్ తీసుకొని, రే ఎవడ్రా నువ్వు, ఏం కావాలి ఎందుకు ఫోన్ చేసావు అని అడిగి కాల్ కట్ చేస్తుంది. 

ఎవడే వాడు -రమ్య 

వాడేవాడో నాకు తెలిదే గత రెండు నెలలుగా ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తున్నాడే. అతను చెప్పినట్లు వినకుంటే అల్లరిపాలు చేస్తాడు బెదిరిస్తాడు. తన దగ్గర నా photos ఏవో వున్నాయంట వాటిని బయటపెట్టి అల్లరి చేస్తానని బెదిరిస్తున్నాడు. 

పోలీస్ కంప్లయింట్ ఈదడం పదా! వళ్ళె వాడి పెల్లీ చేస్తారు. వద్దే కంప్లయింట్ ఇస్తే నాలుగు గోడల మధ్య బతుకుతున్న మేము నాలుగురిముందు నిలబడల్సివస్తుంది. ఈ విషయం తెలిస్తే మా నాన్న చాలా కంగారూ పడతాడు. 

మరేలానే నాన్నకి చెప్పకుండా, పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది.

ఆ.... ఐడియా 

ఎంటే అది -సుజాత 

సాయంత్రం ఆఫీసు ఐపోయాక కలువు చెప్తా -రమ్య 

సాయంత్రం ఇద్దరు canteen లో కూర్చొని కోఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు చెప్పే పొద్దున ఏదో ఐడియా అన్నావు. 

నీకు నచ్చుతుందో లేదో కానీ నీ ప్రాబ్లం సాల్వ్ కావడానికి నాకు తెలిసి ఇదొక్కటే మార్గం -రమ్య 

నసకకుండా చెప్పవే ముందు -సుజాత 

ఏం లేదే మొన్న నిన్ను కాపాడాడు కాద! అతనే ఆ మెకానిక్ అతని సహాయం తీసుకోవటం. 

ఒక్క రోజు పరిచయంతో అతన్ని ఎలా హెల్ప్ చేయమనీ ఆడుగుతామే. 

ని ఇస్టం ఇక నేను చెప్పేది చెప్పాను. బై నేనెలతాను మరి. 

ఆగవే.. వెళ్దాం పదా అతని దగ్గరకి. 

ఇద్దరు కలిసి షెడ్ దగ్గరకి వచ్చారు. లోపలికి వెళ్లారు. అక్కడ రవి బైక్ రిపైర్ చేస్తున్నాడు. 

అన్నా నీ కోసం ఇద్దరమ్మాయిలు వచ్చారు -వెంకీ 

ఏంటి ఇలా వచ్చారు. మళ్ళీ బైక్ రిపైర్ ఆ -రవి 

అబే కాదండీ -రమ్య 

చెప్పవే.. చెప్పవే అని రమ్య నసుగుతూ సుజాత బుజాలని తన భుజంతో తడుముతుంది.  నువ్విలా మవునంగా వుంటె నే వెళ్లిపోతా మరి. 

ఏంటి మిలొ మీరే నసుగుతున్నారు. ఎందుకొచ్చారు కారణం చెప్పండి. 

అది.. అది.. అది.. నాకు.. నాకు.. ఒక చిన్న హెల్ప్ కావాలి అని నసుగుతూ అడుగుతుంది. 

నాతో నీకేం పనుంటుందండి మీరు సాఫ్ట్వేర్ నేను మెకానిక్ అదికాదండి నాకు ఈ పరిస్తులలో మీరు తప్ప ఎవరు కంపడటంలేదు. 

అసలు ముందు matter ఎంటో చెప్పండి -రవి 

సుజాత తడబడుతుండేసరికి రమ్య జరిగిందంత రవికి చెబుతుంది. ఈ matter మా నాన్నకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందండి. మీరే ఎలైన సాయం చేయాలి. 

img


ఒకే చేస్తాను, అతని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. వాడి సంగతి రేపు చూద్దాం. 

మరునాడు ఉదయం 11 గంటలవుతుంది. సుజాత ఇచ్చిన నుమబర్కి కాల్ చేసాడు రవి. ఫస్ట్ టైమ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. సెకండ్ టైమ్ లిఫ్ట్ చేసాడు. 

హలో సర్ నేను surprice గిఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఎవరో surprice గిఫ్ట్ పంపించారండి. నా మొబైలు డిస్ప్లే సరిగా పని చేయట్లేదు మీరు ఎక్కడికి తీసుకురమ్మంటారో చెప్తే తీసుకస్తా అని మాట్లాడేసరికి ఆ యునోనిమస్ పర్సన్ అడ్రసు చెప్పాడు. 

అక్కడికి వెళ్ళే ముందు సుజాత కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు రవి 

రవి యునోనిమస్ చెప్పిన అడ్రస్కొచ్చీ అతనికి కాల్ చేస్తాడు. సర్ నేను మీరు చెప్పిన లొకేషన్కి  వచ్చాను. 

ఒకే బాబు నువవక్కడే వుండు ఒక 2 నిమిషాలలో నేనస్తాను. 

అతను వచ్చి డెలివేరి బాక్స్ తీసుకుంటుంటే. చాచి చెంపపై రెండు దెబ్బలేస్తాడు రవి. 

img
ఎందుకు కొడుతున్నావురా? 

అమ్మాయిలకి ఫోన్ చేసి ఏడిపిస్తావా. ఏడిపిస్తావా అని రోడ్డుపైన కొడుతుంటాడు. అంతలోనే అక్కడికి సుజాత,రమ్య వస్తారు. అతన్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. 

ఆ యునోనిమస్ పర్సన్ సుజాత కాలేజీయె. కాలేజీ అని తెలిసిన తరువాత కొట్టడం ఆపేస్తాడు. 

రేయ్ రోజు మా పక్కనే వుంటూ మమ్మల్నే మోసం చేస్తావరా. ఫ్రెండ్షిప్ లో  నాలుగు మాటలు మాట్లాడితే మా పాటికి మీకు ఏదేదో ఊహించుకుంటారా! -రమ్య 

బయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తే దైర్యంగా ఆ అమ్మాయికి చెప్పాలి లేదా ని మనసులోనే దాచుకోవాలి కానీ ఏదేం ప్రేమ రావన ప్రేమ. 

అయిన ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు అందంతోపాటు, ఆమె ఆనందాన్ని కూడ ప్రేమించాలి. అప్పుడే ప్రేమికులు ఆనందంగా వుంటారు. నువ్వు చేసింది కరెక్ట్కాదు బయ్య. 

Post a Comment

0 Comments