సిన్న దొర బంగుల మీద

img
రచన          :  జోగుల వెంకటేష్(జానపద గీతం ) 

సంగీతం     : జి ల్ నమదేవ్ 

ధర్శకత్వం : ఆకుల విష్ణు ప్రసాద్ 

గానం           : పూడూరి సంజీవ్ & లావణ్య 


సిన్నదొర బంగులమీద సిన్నదొర బంగులమీద 

సీటిలెయ్యకురో.. సిన్నదొర బంగులమీద 

సిటిలెయ్య నీకు నేను సిటిలెయ్య నీకు నేను 

మేన బావనే సిటిలెయ్య నీకు నేను 

సిటిలేస్తే సందిల  మంది సిటిలేస్తే సందిల  మంది 

మనల చూసిరిరో  సిటిలేస్తే సందిల  మంది 

మంది జుస్తే నాకెం బయం మంది జుస్తే నాకెం బయం 

నా  మమా  బిడ్డవె మంది సుస్తే నాకెం బయం


పెద్ద దోర బంగులకాడ పెద్ద దోర బంగులకాడ 

రోజు కాలువకురరో..  పెద్ద దొర బంగులకాడ 

నిన్ను చూడక నిమిశం వుండ నిన్ను కలువక గాడియాలుండ 

ఆ మాటలేలా నిన్ను చూడక నిమిశం వుండ

రోజు కలిసితె మా యన్నలు రోజు కలిసితె మా యన్నలు

మనల చూస్తారురో రోజు కలిసితె మా యన్నలు

మీ అన్నలు నా బామ్మరుదులు మీ అన్నలు నా బామ్మరుదులు

నన్నెమంటరే మీ అన్నలు నా బామ్మరదులు


మూల మలుపు తొవ్వలకడ మూల మలుపు తొవ్వలకడ

ముచ్చట కలుపకురో..  మూల మలుపు తొవ్వలకడ

ని మాట నాకు తేనె మూట ని మాట నాకు తేనె మూట

వినవే ఒ బామా  ని మాట నాకు తేనె మూట

మాట కలిపితే మ అయ్యా  మాట కలిపితే మ అయ్యా

నిన్నే తిడుతాడురో మాట కలిపితే మ అయ్యా

మీ అయ్యా నకు మేన మామ మీ అయ్యా నకు మేన మామ 

 నా మాటింటడె మీ అయ్యా నకు మేనమామ 


నా మీద నీకు ప్రేమలే వుంటె నా మీద నీకు బమలే వుంటె

నన్నెలుకుంటావా నా మీద నీకు ప్రేమలే వుంటె

నవ్వు సై అంటె నీకు తాళి కడుత నుదుటన నీకు కూకుమ పెడుత 

సై అనవే పిల్లా.. సై అంటె నీకు తాళిని  కడత 

బావయ్య ని ఏలు పడుతా బావయ్య ని ఆలినయిత 

నన్నెలుకోవయ్య బావయ్య ని ఏలు పడుతా

ఏలు పట్టి తాళి కడుత న ఇంటి దాన్ని చేసుకుంటా 

రాయే మరదలా.. న ఇంటి దానిని  చేసుకుంటా 

రాయే మరదల న ఇంటి దానిని చేసుకుంటా

రాయే మరదల న ఇంటి దాననిని చేసుకుంటా 

Post a Comment

0 Comments