Money

money

డబ్బు కోసమే నీ ఆరాటం 

డబ్బు కోసమే నీ పోరాటం 

అది దాయతలిస్తే దనికుడివి 

అది శపిస్తే దరిద్రునివి 

డబ్బే రక్త బంధాల్ని విడదీస్తుండి 

డబ్బే ఆ బంధల్ని దరిచేరుస్తుంది 

నువు డబ్బు వెంట పరిగెడితే అది ఆశ 

నీ వెంటే డబ్బు పెరిగెడితే అది ప్రతిఫలం 

డబ్బును ప్రేమించనోడు లేడు 

దాన్ని ముద్దాడనోడూ లేడు 

డబ్బును కడదాక దాచుకున్నోడు లేడు 

దాన్ని తనతో కాటికి తీసుకెళ్లినవడు లేడు 

డబ్బుతోనే నీ పయనం 

డబ్బుతోనే నీ గమనం 

డబ్బే నీ జీవితం 

డబ్బే నీ సర్వస్వం 

డబ్బే నీ బంధం 

డబ్బే నీ అంధం 

జేబులో రూపాయి ఉంటే నువ్వే హీరో 

ఆ జేబే చిల్లు పోతే నువ్వే జీరో 

చేతి నిండా డబ్బులుంటే చేతులెత్తి మొక్కుతారు 

చేతిలో చిల్లీ గవ్వ కూడా లేకపోతే చేయిచెసుకుంటారు 

Post a Comment

0 Comments