ప్రేమ మాయ-వింత గాధ


img

నిన్నటిలాగా లేననిపిస్తుంది ఈ వేల నాకు 

ఒక్కరోజులో ఎంటో ఈ వింత మార్పు నాలో 

వున్నట్టుండి గాల్లో పైకి తెలుతున్నానో

ఆకాశాన్ని అందుకోవాలని ఎగురుతున్నానో 

ఏమిటో ఈ ఆతృత ఎందుకో ఈ ఆవేదన 

ఏదంత నీవాళ్లే కేవలం నీవాళ్లే .. .. 

నిన్ను చూసినప్పటి నుంచి కల్ల ముందే నీ రూపం 

పడుకుంటే మాయమవుతావాని నిద్రనే మానేశా 

 


నదులన్నీ పయనించి చివరికి సంద్రంలో కలిసినట్టు 

ఇ న్నాళ్ళు  పాయనించి నీ దరికి నే చేరాను 

సంద్రంలా నువ్వూ  నన్ను కలుపుకొని పయనించు  

చినుకు చినుకు కలిసిపోయి జడి  వానగా మారినట్టు

అడుగు అడుగు వేసుకుంటూ నీ ఒడిని చేరాను 

జడి  వానకు భూమిలా నన్ను నీ గుండెల్లో దాచుకో 

ఒక్క చీమ వెనుక చీమల దండు బయలు దేరినట్టు

నీ వెన నీను నా వెనక నా వాళ్ళు బయలుదేరారు 

చీమల దండులా నాతో నువు జంటగా ముందడుగేయి 

పెనుగాలి వెనుక సుడి  గాలి  మెలిక  నడిచినట్టు   

నీ అడుగుల జాడ వెతుకుతూ ఆశతో వస్తున్న 

సుడిగాలిగా నన్నూ నీతో కలుపుకొని పయనించు 


నువు నా కోసమే పుట్టవేమో అనిపిస్తుంది 

నువు నా తోడుగా లేకుంటే బ్రతుకే లేనట్టే 

ఇద్దరి మనసులు ఒకటిగా ఎప్పుడు మారుతాయో 

మన రెండు చిటికెన వెళ్ళు ఎప్పుడు కలుస్తాయో 

నీ మెడలో నా ముని వెళ్ళు ఎప్పుడు మూడు ముల్లెస్తానో 

చల్లగా నాలుగు కాలాలపాటు బతకమని ఎప్పుడు దీవిస్తారో 

పంచ భూతాలు మనకి సాక్షిగా  ఎప్పుడు ఉంటాయో 

ఆరు నూరు చేసి నిన్ను నా దాన్ని ఎప్పుడు చేసుకుంటావో 

ఏడు అడుగులు నీతో ఎప్పుడు నాడుస్తానో 

Post a Comment

1 Comments