బరువైన రోజు



 సువర్ణ

 ఆది భూపతి రెడ్డి పెద్దపాడు జిల్లాలోని భూపతినగరం అనే గ్రామంలో ఒక భూస్వామి,పేరుమోసిన రైతు.భూపతి గారి పూర్వీకుల కారణంగా ఆ గ్రామానికి భూపతి నగరం అనే పేరు వచ్చింది.ఆది భూపతి రెడ్డికి 100 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ తను ఒక సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.

 

img

ఆది భూపతి రెడ్డికి ఒక కూతురు,కుమారుడు.రెడ్డిగారికి కూతురంటే చాలా ఇష్టం.కూతురికి తన అమ్మగారి పెరుమీదుగా సువర్ణ అని పేరు పెట్టుకున్నాడు.పుట్టినప్పటినుంచి తన కూతురిని చాలా అల్లారుముద్దుగా పెంచేవాడు.ఏదడిగితే అది లేదనకుండా,కాదనకుండా తెచ్చిపెట్టేవాడు.తన కూతురిపైన తనకున్న ప్రేమను చూసి అందరూ బయటికి వెల్లడించకున్న మనసులో కుల్లుకునేవారు. 

మనం 20 వ శతాబ్దంలో ఆధునిక కాలంలో ఉన్నప్పటికీ ఇంకా కొందరు పరువు,ప్రతిష్ట అను రెండు అమూల్యమైన విలువలను వారి భుజస్కందాలపైన మోస్తున్నారు,ఆ కొందరిలో ఒకరు మన రెడ్డిగారు.అందరూ అనుకుంటారు ఈ పరువు ,ప్రతిష్టలు ఇంకా ఉన్నాయా,ఇంకా పాతకాలం మనిషిలా వాటిని పట్టుకొని వేలాడుతున్నారు వదిలేయక అని.కానీ వాటి విలువ తెలుసిన వాళ్లకు తెలుస్తుంది అవి ఎంత విలువైనవో,బరువైనవో అని.

సువర్ణ అందరూ అమ్మాయిల్లా కాకుండా చాలా తెలివైనది,తండ్రి మాట ఎప్పుడు జవాదాటేది కాదు.చిన్నప్పటినుంచి కూడా తండ్రి చెప్పినట్టు నదిచుకునేది.ఎప్పుడు తండ్రి మాట జవాడయేది కాదు,పైగా తన తండ్రి ఆలోచనలతో ఏకీభవించేది.పాఠశాల,కాలేజ్ లాల్లో కూడా ఎవరితో అంత క్లోజ్ గా మూవ్ అయ్యేది కాదు.తన పనెంతో తాను చూసుకుని ఇంటికి చేరుకునేది.సువర్ణ నడవడిక చూసి రెడ్డిగారు చాలా గర్వపడేవారు,ఆనందపడేవాడు.

అందరు పిల్లలలాగే సువర్ణ తన తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఎంతో కాలం పట్టలేదు.చదువు అయిపోయిన తర్వాత రెడ్డిగారు కూతురికి ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు.ఆ సంబంధం ఖాయం కూడా అయిపోయింది,అప్పటివరకు పెళ్లి సంబంధం ఖాయం కాగానే దయ్యం పట్టిన మనిషిలా ఒక్కసారిగా మారిపోయింది.నాన్న నేను కొన్నాళ్ళు మావయ్య వాళ్ళింట్లో ఉంటాను అని చెప్పి విజయవాడకు వచ్చింది.

ఇన్నాళ్లు ఎలా పవిత్రంగా ఉండాలని ఆలోచించిన సువర్ణ ఇప్పుడు ఎలా అపవిత్రమై పావలా అని ఆలోచిస్తుంది.నాన్నగారి పరువు,మర్యాద అన్ని మరచి బరితెగించిన దానిలా రోడ్లుపై తిరగ సాగింది.మావయ్య,అత్తయ్య ఇద్దరు ఆఫీసుకు వెళ్ళాక అబ్బాయిల కోసం తన వేట మొదటపెట్టేది.మల్లి సాయంత్రానికల్లా ఎవరికి అనుమానం రాకుండా ఇంటికి వచ్చేది.

రోజుకోకన్నీ పరిచయం చేసుకోవటం వాడితో A to Z లో X తో పాటు అన్ని చేసేవటం,ఏమి తెలియని అమాయకురాలిలా సాయంత్రానికల్లా ఇంటికి రావటం ,ఇది రోజు వారీ దినచర్య ఐపోయింది.

చూస్తుండగానే పెళ్లి రోజులు దగ్గరపడ్డాయి,ఇంకో వారం రోజులయితే పెళ్లి అనగా సువర్ణ భూపతి నగరం వెళ్ళింది.తను సిటీలో పడ్డ యాదవ వేశాల గురించి ఇంకా ఎవరికి తెలియదు.తాను చేసిన పనుల గురించి ఎవరికి తెలిసే ఛాన్స్ లేదనుకుని చాలా దైర్యంగా పెళ్లి పీటలపై కూర్చుంది.కానీ పెళ్ళికొడుకు క్లోస్ ఫ్రెండ్ సువర్ణ గురించి పూస గుచ్చినట్టు తన ఫ్రెండుకి చెప్పాడు,ఆధారాలతో సహా చూపించాడు.ఇవన్నీ చూసి సంబంధం వద్దనుకొని పెళ్ళికొడుకు తరఫు వారు వెళ్లిపోయారు.

ఇంత జరిగినా కూడా రెడ్డిగారికి కూతురిపై నమ్మకం పోలేదు.తనని పిలిచి ఎప్పుడు ఆ విషయం గురించి మాట్లాడలేదు ఎందుకంటే తను కూతురిని నమ్మాడు.అలవాటు పడ్డ ప్రాణం కదా ఊల్లో కూడా ఎదవేషాలు వేయసాగింది.తన కూతురు చేస్తున్న పనుల గురించి ఆ నోటా ఈ నోటా రెడ్డి గారి చెవిలో పడింది.అప్పుడే కూతురిపై కొంత అపనమ్మకం ఏర్పడింది.ఒకరోజు పొలానికి వెళ్తూ పాడుబద్ద బంగాలనుంచి తన కూతురు పని మనిషి రావడం చూసాడు.

img 

కూతురిని అక్కడ చూసినప్పటినుంచి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడు.సువర్ణ ఇంటికొచ్చాక ఎక్కడినుంచి వస్తున్నావ్ అని అడిగాడు. నాన్న అది అది మన కౌసల్య వాళ్ళింటికి వెళ్ళొస్తున్న అనగానే సిగ పట్టి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి ఒకటే వేటుతో తల నరికేశాడు.

*** నమ్మిన వారి నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు ***

*** కన్నవారి అమితమైన ప్రేమని ఆసరాగా తీసుకుని వారిని మోసం చేయటం హత్య చేసిన దానికన్నా నేరం ***

Post a Comment

0 Comments