ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం

img


మాయదారి మావోళ్లు మాచెడ్డవాళ్ళు కన్నోళ్లు
సూటిపోటి మాటలతోని సూదిమొన సూపులతో
అనువంత అనుమానంతో అనకొండ కోపంతో
ఆడదాంనన్న నేపంతో అనగదొక్కాలన్న తాపంతో
కులపిచ్చి క్రోధంతో సమాజపిచ్చి మాయతో
మానవత్వం లేకనో నాగరిక జ్ఞానంతోనో
కుటుంబ గౌరవాణికో సమాజ శ్రేయస్సుకో
ఆత్మ నిబ్బరాణికో ఆడంబ సంబరాలకో
కూతురి ఆనందానికో సమాజ గౌరవాణికో
మూఢ నమ్మకాలతోనో ఘాడ విశ్వాసాలతోనో
మనసాక్షిగా ప్రేమించిన ప్రియుడిని వదిలేసి
కను సాక్షిగా చూసిన వారుడిని పెళ్లి చేసుకో
అన్నప్పుడు నా కంటి నుంచి కన్నీటిదార
ఆగకుండా ఏరులై పారే సెలయెరుదాకా
మనస్సు విరిగి వేయి ముక్కలైపోయింది
వీచే చల్లని గాలితో నీ స్పర్శను ఆస్వాదిస్తూ
నీలి మేఘాలతో నీకై స్నేహం చేస్తూ
రుతు పవనాలతో సందేశం పంపుతున్న
ఈ సందేశం నీకందేవరకు నా ప్రాణం
నా దేహాన్ని విడిచి నీ ప్రేమకై తపిస్తూ
తిరిగిరాని లోకాలకు వెళుతుందేమో
ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని
జీవించి ఉండడం కంటే ప్రాణాలు వదిలి
పరలోకంలో నీ జ్ఞాపకాలతో గడపటం మేలు

ప్రేమిచడానికి వచ్చిన ధైర్యం పేరెంట్స్ని
వదిలి వెళ్లిపోవడానికి రావట్లేదంటే
అది పేరెంట్స్ మీదున్న గౌరవం కానీ
ఇద్దరు మనుషులు అసమర్థ కాదు

రెండు మనసులు కలిస్తేనే ఇద్దరం ఒక్కటై
ఒకటిగా కలిసి జీవించాలనుకుంటాం
దగ్గరైన రెండు మనసులను విడదీసి
దూరం చేసినంత మాత్రాన మనిషి
మనసులో కలిగిన భావాలను తొలగించలేరు
అల తొలగించడం సృష్టికర్త బ్రాహ్మతోనే కాలేదు

ఎప్పుడో జరిగిన ప్రేమ కథ అంటే మనందరికి ఇష్టం
దాని గురించి చదువుకుంటాం గొప్పలు చెప్పుకుంటాం
కానీ అలాంటిదే ఒక ప్రేమ కథ మన చుట్టుపక్కల లేదా
మన ఇంట్లో జరిజితే మాత్రం ఉద్రేకానికి లోనవుతాం
ఎక్కడో ఎవరికో జరిగింది నచుతుంది కానీ
మన ఇంట్లో వారికి,దగ్గరి వాళ్లకు జరిగితే నచ్చదు

ఇద్దరు మనుషుల ప్రేమ పెళ్లి దాకా వెల్లట్లేదంటే అది 
ఇద్దరు మనుషుల మనసులు కలవక కాదు
ఇద్దరి కుటుంబాల కులాలు కలవక

కానీ ఒక్కటి మాత్రం నిజం ధైర్యం, భయం ఎప్పుడు
ప్రేమకు శత్రువులే అవి మన ప్రేమని ముందుకెళ్లనియవు
ధైర్యాన్ని స్నేహంగా మార్చుకో భయాన్నీ  దరికె రానివకు 
అపుడు ప్రేమ నీ వెంటే జీవితాంతం తోడై ఉంటుంది

Post a Comment

0 Comments