నిన్న ఇలా లేదు ఈ ఫీలింగ్
మొన్న ఇలా లేదు ఈ వింత భావన
నిన్నలా మొన్నలా కాకుండా
నాకు నేనే ఈ వేళ కొత్తగా అనిపిస్తున్న
తెలియని సంగ్దిద్దంలో
తెలుసుకోవాలనే ఆకాంక్షతో
తెలిసి తెలియని మాయలో పడ్డ
ఈ కొత్త ఊసుల్ని ఏమంటారో, తెలియదు
బహుశా దీన్నే ప్రేమంటారేమో
ఊహల్లోనే వినరిస్తున్న
ఊసుల్లోనే పయనిస్తున్న
ఆశతో బ్రతుకుతున్న
ఆనందంలో విహరిస్తున్న
ప్రేమ రాగాలు పడుతున్న
మౌన రాగాలు వింటున్న
తనని చూసిన క్షణం ఆ నిండు జాబిలి
ఆకాశాన్ని ఒంటరిగా వదిలేసి నా కోసం
ఈ నేలపై వాలిందా అనిపించింది.
నా కోసమే ఈ భువిపైకి దిగిస్తే పాపం
ఆ చుక్కలు చుక్కలు వెలుగు లేక
చిన్నబోతయేమోనని అక్కడే ఉండమన్న
నీటి చెలిమేలో నీటిలాగ నిశ్చయంగా ఉండే నా మనసుని
మెరుపు దాడికి గురైన సముద్రం అలలా మార్చేశావు.
ఆ అలను అలను భందించి ఓ పెద్ద అలజడై
నిను చేరే వరకు నిను పొందే వరకు పయనిస్తూనే ఉంటా...
0 Comments