Love Feeling

love

Love Feeling:
నువు దూరంగా వుంటె ఏదో అనుకోని వెలితి 

నువు దగ్గరగా వుంటె ఏదో తీయని అనుభూతి 

నీతోనే నూరేళ్ళ జీవితం గడపాలని 

నీ వెంటే చివరి అడుగు వేయాలని 

ఈ ఆనందం కడదాక నాతో వుండాలని 

నా మనసులోని ఆనందం నన్నొదిలి 

కన్నీటి చుక్కలై కదిలిపోకముందే 

ఆ మాట నీతో చెప్పాలనుకున్న 


ఆనందంతో మనసు లోతులో అల్లుకున్న 

ఊసులను వెతికి నీతో చెప్పాలనుకున్న 

కానీ ఏ ప్రేమ కవితలు నీకు సరిపోవట్లేదు

నీకోసం నేనే ప్రేమ కవినవ్వాలఎమో  

నా గుండెల్లో దాచుకున్న ఆకాశమంత ప్రేమని 

ఒక చిన్న మాటతో నీ ఒడిని చేర్చాలనుకున్న 

ఆ మాటే నా పెదవి దాటి బయటికి రావట్లేదు 

భయంతోనో మరి భారంతోనో 

అయినా వస్తున్న చెప్పడానికి సిద్దంగా వుండు....

 

Post a Comment

1 Comments