నేను ?

nenu

నేను నేనంటే 

నేను, నేనంటే ఎవరో అనుకోకు 

నేనంటే నేనే, నీ అంతరాత్మని 

నీకున్న ఏకైక అంతర మిత్రున్ని 

ఎన్నో రాత్రులు నీతో గడిపా 

ఎన్నో పగల్లు నీతో నడిచా 

ఐనా ఏం లాభం ?

నువు  నన్ను పట్టించుకోవడం లేదు

ఎందుకు, ఎందుకని నిన్నడగను 

ఎందుకంటే నువే నా ఏకైక నేస్తం 

ఎందరితోనో చెబుతున్నావు నీ కష్టాలు 

ఎందరితోనో అడుగుతున్నావు సలహాలు 

కానీ నీకు గుర్తుకు రాలేదా ?

ఐనా నువ్వే నా ప్రియ నేస్తం 

నీ సంతోషమే నా ఆనందం 

అందుకే చెబుతున్నా విను 

"నన్నడుగు " 



Post a Comment

0 Comments