Mechanic -1

Mechanic -1 

Mechanic is the love story of one bike mechanic and a software engineer. In this story Ravi is the mechanic and Sujatha is a software engineer. 

రవి ఒక సాదారణ బైక్ మెకానిక్, చెప్పుకోవడానికి తనకేవరూ లేరు తను ఒక అనాద. తన పన్నెండవ ఏట ఒక ఆక్సిడెంట్లోఅమ్మా నాన్న ఇద్దరూ చనిపోవడంతో ఒంటరీవాడై పోయాడు , తల్లిదండ్రులు చనిపోయాక ఒంటరి వాడై ఒక్కడే వున్నా తన కుటుంబ బంధువులు ఎవ్వరూ చెరదీయలేదు. దాంతో తనకెంతో ఇస్టమైన చదువును అక్కడితో ఆపి వేయవలసి వచ్చింది . ఈ పని ఆ పని అని తేడా లేకుండా పొట్ట నింపుకోవడానికి ఏ పని దొరికితే అది చేసాడు.చివరికి వాళ్ళ నాన్న స్నేహితుని మెకానిక్ షాపులో మెకానిక్గా చేరాడు. అప్పటి నుంచి ఇక వేరే ఏ పని చేయకుండా షాపులో వుండి పని నేర్చుకున్నాడు. ఎంత పని చేసినా జీతం మాత్రం సరిగా ఇచ్చేవాడు కాదు, దాంతో చేసేది ఏమిలేక ఎన్నో ఆకలి నిద్రలు గడిపాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మరెన్నో కస్టాలు అనుభవించాడు. చివరికి జనాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వారికి అనుగూణంగా బ్రతకసాగాడు. 

image

కొన్ని రోజులకు రవి సొంతగా షెడ్ ఓపెన్ చేసుకొని పని చేసుకుంటున్నాడు. ఎవరికిందా పని చేయాల్సిన అవసరం లేకుండా తన పని చేసుకుంటూ, రిపర్స్ ఉంటే చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా గడుపుతున్నాడు. కొన్ని రోజులకి తన వద్దకి వచ్చే కస్టమర్స్ ఎక్కువవడంతో ఒక అసిస్టంట్ని పెట్టుకున్నాడు తన పేరు వెంకీ. రోజు పొద్దున్నే లేవడం షెడ్కి వెళ్ళడం పని చేసుకోవడం సాయంత్రానికి ఇంటికి రావడం పడుకోవడం.

img

సుజాత ఒక మద్యతరగతి తండ్రి కూతురు, తల్లి చాటు తెలిగింటి ఆడపిల్ల. ఇంజినీరింగ్ చదివి జాబ్ చేస్తుంది. రోజు ఆఫీసుకెళ్లడం, సాయంత్రానికి ఇంటికి రావడం సెలవు రోజుల్లో ఫ్యామిలీ అంతా బయటికెళ్లడం ఇదే సుజాత రోజు దినచర్య. ఎక్కువ మందితో స్నేహం కూడా లేదు వున్న ఇద్దరితోనే మాట్లాడటం చాలా తక్కువ. సుజాతకి కొంచెం సిగ్గు ఎక్కువే. ఒక వారం రోజుల క్రితమే ఆమెకి పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి వాళ్ళకి కూడా సుజాత బాగా నచ్చింది. తొందరలో ఎంగేజ్మెంట్ పెట్టుకుండామని చెప్పి వెళ్లిపోయారు. అబ్బాయి బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నాడు. వయసు కొంచెం ఎక్కువే అయినప్పటికీ అమ్మాయి సుఖంగా ఉంటుందని సుజాత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనలేక సుజాత కూడా ఒప్పుకుంది.

రవి షెడ్ సుజాత ఇంటి దగ్గరలోనే ఉంటుంది. రోజు సుజాత షెడ్ ముందునుచే ఆఫ్ఫిసు కెళుతుంది, ఎన్నో సార్లు బైక్ రిపైర్ వచ్చినా వాళ్ళ నాన్న చేపించేవాడు. తన అతి సిగ్గుతో ఎవరితోనూ అసలు మాట్లాడేది కాదు.

Click Here to read Mechanic-2 

Post a Comment

0 Comments