ఇది మాయో మర్మమో
సందేహమో సంశయమో
విది ఆడుతున్న నాటకమో
దేవుడు ఆడుతున్న కపట నాటకామో
నా మనసులో ఏముందో నాకైనా తెలియటం లేదు
నా మైండ్ ఎం ఆలోచిస్తుందో ఏం అర్థం కావటం లేదు
నా మనసు నా దగ్గర ఉందొ లేదో నా మీదే ఓ డౌటు
అసలు ఉందొ లేదో తెలియని ప్రేమ కోసం
ఎందుకో నా ఈ తాపత్రయం
ప్రేమ ఇస్తున్నానో ప్రేమను కావలనుకుంటున్నానో
I love you చెప్పాలని ఉంది
కాని LOVE చేస్తున్నానో లేదో తెలీదు
I hate you చెప్పాలనిపిస్తుంది
కానీ HATE చేసేంత ద్వేషం లేదనిపిస్తుంది
రెండు మనసుల జీవిత బందం ప్రేమ
ఈ బంధాన్ని ఇక్కడే ఆపాలో చి
వరిదాకా కొనసాగించాలో తెలీదు
కానీ ప్రేమలో ప్రయాణిస్తున్నాను
ఎక్కడిదాకో ఈ ప్రయాణం తెలీదు
కానీ అడుగుతో అడుగు కలుపుతున్నాను
గమ్యమే లేని నాకు నీవు ఒక గమ్యానివో
ఆ గమ్యాన్ని చేరుకోవడానికి తోడ్పడే మార్గానివో
మనసు తత్వాలు కలుపుకోవాలో
బంధుత్వాలను విడగొట్టుకోవలో
కలకాలం నీ వెంటే నడవాలో
కన్నీళ్ల సంద్రంలో మునగలో
ప్రేమ పొందుతున్నానని గర్వపడలో
ప్రేమకు నేను సరిపోనని నిరాశపడలో
భవిష్యత్ ఆశలో ప్రస్తుత గోసలో
ప్రేమ మాయనో ప్రియ మాయనో
ప్రేమను పెంచుకోవాలో కీర్తిని కోరుకోవాలో
ఏమి తెలియని స్థితి గందరగోళ పరిస్థితి
ఏమి తోచని గతి అయోమయ గతి
మనసేమో I Love You అంటుంది
మైండెమో I Don't Know అంటుంది
ఈ రెండిటి మధ్య మనిషిగా ఏ నిర్ణయం తీసుకోవాలో...
0 Comments