mechanic-2

సుజాత ప్రొద్దున్నే లెచి రెడీ అయ్యి ఆఫీసుకి బయలుదేరాడానికి సిద్దామయి బయటకి వచ్చి లంచ్ బాక్స్ స్కూటీలో పెట్టుకొని బైక్ ఎక్కి నాన్న బాయ్ అని చెప్పి కి ఆన్ చేసి బైక్ స్టార్ట్ చేస్తుంది. కానీ అది ఎంతకూ స్టార్ట్ కావట్లేదు 

img

నాన్న ఒకసారి ఇలారా, నా బైక్ స్టార్ట్ కావటం లేదు ఎంటో చూడు. అతను వచ్చి స్టార్ట్ చేసినా 
స్టార్ట్ కాకపోయేసరికి దీనికి ఇన్జన్లో ఏదో సమస్య వున్నటుందమ్మా అందుకే స్టార్ట్ కావటం లేదనుకుంట! అన్నాడు. నాన్న నాకు ఆఫీసుకి లేటవుతుంది నన్ను ఆఫీసు దగ్గర డ్రాప్ చేసి వెల్లవా? లేదురా ఈ రోజు నాకు కొంచం అర్జెంట్ పని వుందిరా ఎగ్జాక్ట్గా  9:30 కి అక్కడ వుండాలి. 

ఓ పని చేయి నువు  ని ఫ్రెండ్ రమ్యకి ఫోన్ చేసి తన బండి పై వెళ్ళు. ఆ .. చెప్పటం మర్చిపోయా .. నేను సాయంత్రం రావటానికి కొంచం లేటవుతుంది ఈ బండి ని మన విదిలో వున్న మెకానిక్ షెడ్ దగ్గర ఇచ్చేసి వెళ్ళు, నేను తొందరగా వస్తే సాయంత్రం తీసుకోస్తా బాయ్ రా .. అని తన బండి పై వెళ్ళిపోయాడు. 

కొంచం నీరసంగా తన బ్యాగ్లోనుంచి ఫోన్ తీసి రమ్యకు ఫోన్ చేస్తుంది . 

రమ్య వచ్చాక ఇద్దరు కలిసి రవి మెకానిక్ షెడ్ దగ్గరకి బైక్ తీసుకొని వెళ్లారు సుజాత బండి పట్టుకొని వుంది, పక్కన రమ్య వుంది . 

అన్నా! ఈ బండి సడన్ గా ఎందుకో స్టార్ట్ కావటం లేదు , నిన్నే ఫుల్ టాంక్ పెట్రోల్ కొట్టించం, పోయిన నేలనే సర్వీసింగ్ కూడ చేపించాం. ఏమైందో అర్దం కావటం లేదు కొంచం చూడన్న ? - రమ్య 

కడుపునిండా ఫుల్లుగా తిన్న, కాల్లు లేకపోతే ఎలా నాడుస్తాం అండి ఆనుకుంటు అని సుజాతను పక్కకు జరగమని బండి స్టార్ట్ చేసి చూసి, ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వున్నట్టుంది పవర్ సుప్లే కావట్లేదు, రిపేర్ కావటానికి కొంచం టైమ్ పడుతుంది. సాయంత్రం వచ్చి మీ బండి తీసుకెళ్లండి . 

ఒక అర్ద గంటలో ఏమైనా.. ?

ఈ బండి మీద ? తనదా ?

తనదే..  

మరి ఆ అమ్మాయి మాట్లాట్లేదె . 

తనకి కొంచం సిగ్గేక్కువ,ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు

 మనిషితో మనిషి మాట్లాడటానికి సిగ్గెందుకండి, పక్షులతోను జంతువులతోనూ మాట్లాడితే సిగ్గుపడలి. మీ సిగ్గు మీ దగ్గరే వుంచుకోండి గాని సాయంత్రం వచ్చి మీ బండి తీసుకెళ్లండి 

వెళ్లొస్తాం అండి - రమ్య 

అరె వెంకీ ఈ బండి ప్రాబ్లం ఏందో చూడరా ?

మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది! హలో సార్ మీ బండి రిపైర్ అయ్యింది వచ్చి తీసుకెళ్లండి. 

రవి కొంచం ఏమనుకోకుండా బండిని మణికొండ దాకా తీసుకొస్తావా, నీకు డబ్బులు కూడ అక్కడే ఇస్తా.. నాకు కొంచం అర్జెంట్ పని వుంది ప్లీజ్.. 

ఓకే, తీసుకొస్తా! 

అరే రవి ఆ pulsar బండి డెలివరీ ఇవ్వాలి వెల్లద్దం పదా! 

ఎద్దారు చెరొక బండి వేసుకొని వెళ్తారు, మళ్ళీ రావడానికి వీలుగా. 

ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి కస్టమర్కి ఫోన్ చేస్తాడు. ఆ కస్టమర్ అక్కడే వెట్ చేయమని చెప్తాడు. 

కొంచం దూరంలో హోటల్ ముందు కొంతమంది యువకులు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు దూరం నుంచి ఎవరో సరిగా కనపడక దగ్గరికెళ్ళి చూసే సరికి పొద్దున తన షాప్కొచ్చిన అమ్మాయి. 

చాలా బూతు మాటలు మాట్లాడుతూ, అనకూడాని మాటలతో అమ్మాయిని వేదిస్తున్నారు. వారి మాటలకు ఆమె ఎక్కేక్కీ ఏడుస్తుంది. 

అన్నా.. అన్నా.. వొంటరీగా వున్న ఆడపిల్లని ఏడిపించడం తప్పు అన్నా.. నికు నిజంగా దమ్ముంటే వల్ల అమ్మ, నాన్న, అన్నా అందరి ముందు ఏడిపించు కానీ ఎలా నలుగురిముందు కాదు. 

ఏంట్రా దీనికి నువ్వు సపోర్ట్,దీనికి నీకు ఏంట్రా సంబందం?  దారిన పోయేవాడివి, దారినపోయేవాడిలా తలదించుకొని పో కాదని ఈ విషయంలో తల దూరిస్తే ని మోండానికి తల లేకుండా చేస్తాం. 

రేయ్ నువ్వు దనికేమైన రంకు....  

అనేసరికి రవికి కోపం వచ్చి, ఆ క్రొదంలో వారిని కొట్టాడు ఆ కొట్లాటలో రవి మెడకు కత్తి గీసుకుంటుంది. 

దూరం నుంచి పోలీస్ సైరన్ వినపడటంతో వాళ్ళంత అక్కడినుంచి వెళ్లిపోయారు. 

సుజాత ఇంకా ఏడుస్తునే వుంటుంది, ఎంత ఆపిన వురుకోదు. 

చాలా థాంక్స్ అంది రమ్య. 

థాంక్స్ తారువతలె గాని ముందు ఆ అమ్మాయిని ఏడుపు ఆపించి, కొంచం మంచి నీళ్ళు తాగించు. 

కస్టమర్ కు బండి ఇచ్చేసి వెళ్లిపోతారు. 

సాయంత్రం ఆఫీసయిపోయాక మళ్ళీ ఇద్దారు కలిసి బండి తీసుకోవటానికి రవి షాప్ కి వెళతారు. 

రమ్య - భయ్య బండి రిపేర్ అయిందా?  

హ అయిపోయింది మీరు తీసుకెళ్ళచ్చు. 

చాలా థాంక్స్ భయ్యా, 

ఎందుకు బండి రిపేర్ చేసినందుకా? థాంక్స్ చెప్పి డబ్బులేగ్గోదమనుకున్నారా ఎంటి ?

అయ్యో అందుకు కాదు భయ్యా పొద్దున నా ఫ్రెండ్ ని కపడినందుకు. 

ఎంటి ని ఫ్రెండ్కి  ఇంకా మాటలు రాలేదా? చెప్పానుకదా తనకి కొంచం సిగ్గు ఎక్కువాని, ఏయ్ థాంక్స్ చెప్పవే.... చెప్పవే ఎంత చెప్పిన సుజాత అస్సలు నోరు విప్పి థాంక్స్ చెప్పకుండా తలదించుకొని అలాగే నిలుచొని వుంటుంది బండి తీసుకొనవి బయటికొచ్చి, ఏయ్ పొద్దున ని కోసం అంత కస్టపడి నిన్ను కాపాడాడు, అతనికి కూడ దెబ్బలు తకాయి ఒక్క థాంక్స్ చెప్పేందు ఏమాయిందే నీకు. 

ఏమోనే తనని చూసేసరికి ఒంటినిండా చెమటలు పుట్టి నోటి వెంట మాట రాలేదే. 

రేపు పెళ్లి చేసుకున్న, మీ ఆయనతోనైనా మాట్లాడుతావా లేదంటే సిగ్గుపడి నోటిమాట గుండెలోనే దాచుకుంటావా.. 

  


Post a Comment

0 Comments